Food
మైగ్రేన్ తలనొప్పి బాధితులు మన చుట్టూనే చాలా మంది ఉంటారు. ఈ నొప్పి రావడానికి కారణాలు చాలానే ఉండొచ్చు.
నిద్రలేమి, ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, పెద్ద శబ్దాలు, వేడి, నీటి కొరత వంటివి మైగ్రేన్ కి కారణం కావచ్చు.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు దూరంగా ఉండాల్సిన ఆహారాలివే...
ఊరగాయల్లో టైరమైన్, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి మైగ్రేన్ కి కారణం అవుతాయి.
ఎర్ర మిరపకాయలు, మసాలాలు రుచికరమైన వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. కానీ అవి తలనొప్పికి దారితీస్తాయి.
కెఫీన్ ఉన్న పానీయాలు (టీ, కాఫీ) తలనొప్పిని కలిగిస్తాయి. అధిక కెఫీన్ తలనొప్పికి దారితీస్తుంది.
చాక్లెట్ ఆహారాలలో కెఫీన్, బీటా-ఫెనైలెతైలామైన్ ఉంటాయి. ఇది తలనొప్పికి కారణమవుతుంది.
హాట్ డాగ్, సాసేజ్‌లలో సోడియం నైట్రేట్ ఉండవచ్చు, ఇది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది.
చాలా రకాల ఫుడ్స్ లో ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ వాడుతుంటారు . ఇది మైగ్రేన్ సమస్యను కలిగిస్తుంది.
చీజ్ తరచుగా తలనొప్పిని పెంచుతుంది. కాబట్టి చీజ్ ఎక్కువగా తినకూడదు.