ఆలుగడ్డ తొక్కలో చాలా పోషకాలు ఉంటాయి. ఈ తొక్కలో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తింటే త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి ఈ తొక్కతో రుద్దవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.
ఆలుగడ్డ తొక్కను ఉడికించిన నీటితో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఆలుగడ్డ తొక్కలో ఉండే ఫైటోకెమికల్స్ శరీర కణాలను రక్షించి, క్యాన్సర్ రాకుండా నివారించడంలో సహాయపడతాయి.
ఆలుగడ్డలను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి, తొక్కతో పాటే వండుకోవచ్చు. లేదా తొక్కను బాగా వేయించి స్నాక్స్‌లా కూడా తినొచ్చు.
Apple: యాపిల్ పై మైనం పూత ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే
Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?
Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!