Food

అసలేంటీ మఖానా.. వీటిని తింటే ఏమవుతుంది.?

Image credits: Instagram

రక్తపోటు అదుపులో

మఖానాలో సోడియం తక్కువగా ఉంటుంది. అదే విధంగా పొటాషియం అధికంగా ఉంటుంది. దీంతో వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

గుండెపోటు

మఖానాలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవడంలో ఉపయోగపడుతుంది. 

Image credits: social media

బరవు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్‌

మఖానాలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. బ్లడ్‌లో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి.
 

Image credits: Getty

కీళ్ల నొప్పులకు చెక్‌

మఖానాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. అర్థరైటిస్‌ సమస్య తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: google

మెదడు ఆరోగ్యం

మఖానాలో థయామిన్‌ అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో అల్జీమర్స్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. 
 

Image credits: Getty

సంతానలేమి సమస్యలకు

పురుషుల్లో వీర్య నాణ్యతను, కౌంట్‌ను పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. మహిళల్లో PCOS, PCOD సమస్యలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
 

Image credits: social media

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

నెయ్యి స్వచ్ఛత తెలుసుకునేదెలా?

ఆరెంజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది?

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?

అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్‌.