Food
రసాన్ని చింతపండు, టమాటా,మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర వంటి మసాలా దినుసులతో తయారుచేస్తారు. వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రసంలో వేసే మిరియాలు, జీలకర్ర, అల్లం మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే పేగులను ఆరోగ్యంగా ఉంచి అజీర్ణం సమస్యను తగ్గిస్తాయి.
రసంలో వేసే మిరియాలు, పసుపు, వెల్లుల్లి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి.
రసంలో వాటర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల మన శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గదు. ఇది మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రసంలోని మసాలా దినుసులు మన నాసికా మార్గాలను శుభ్రపరుస్తాయి. అలాగే గొంతునొప్పిని తగ్గించడానికి, శ్వాసకోస సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
రసం మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రసంలో కేలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఈ సూప్ మీ బరువును అదుపులో ఉంచుతుంది.
రసం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని భోజనంతో తీసుకోవడం మంచిది.