Food
మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, మంచి పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలెట్, ఫైబర్ వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నారింజ పండ్లలో ఒక్క విటమిన్ సి మాత్రమే కాదు ఫైబర్, పొటాషియం వంటి గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తింటే కూడా గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
నట్స్ లో మన గుండెను ఆరోగ్యంగా ఉంచే మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదం, వాల్ నట్స్ ను రోజూ గుప్పెడు తింటే మీ గుండె క్షేమంగా ఉంటుంది.
దానిమ్మ పండు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ధమనుల్లో ఫ్యాట్ పేరుకుపోకుండా చూస్తాయి.
వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను, హైబీపీని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
క్యారెట్లు ఒక్క కంటిని మాత్రమే కాదు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే పొటాషియం,బీటా కెరోటిన్, ఫైబర్ లు కొలెస్ట్రాల్ ను రక్తపోటును తగ్గిస్తాయి.
బీట్రూట్ లో పుష్కలంగా నైట్రేట్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.