Food
గుమ్మడి గింజల్లో ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు, మంచి కొవ్వులు ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు యాంటీఆక్సిడెంట్లకు నిలయం. ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇది మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుమ్మడి గింజల్లో జింక్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇది ఎముకలను బలంగా చేస్తుంది.
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు ఉండటం వల్ల ఇది మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
గుమ్మడి గింజల్లో మంచి కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
గుమ్మడి గింజలు పురుషుల వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.