Food
ఆరోగ్యకరమైన కొవ్వులు పల్లీల్లో ఉన్నాయి. రోజుకు గుప్పెడు పల్లీలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పల్లీలు రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే.
పల్లీల్లో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పల్లీల్లో ఉండటం వల్ల వీటిని డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పల్లీల్లో ఉండటం వల్ల మెదడుకు కూడా చాలా మంచిది.
పల్లీల్లో పీచు పదార్థం ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పల్లీల్లో ఉండటం వల్ల చర్మానికి కూడా చాలా మంచిది.