Food
గోంగూర, పుంటికూర పేర్లతో పిలిచే ఈ ఆకు కూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే మంచిది.
గోంగూరలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు గోంగూరను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
నెలసరి సమయంలో మహిళలకు కాళ్లు లాగడం, నడుం వంటి సమస్యలకు గోంగూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
గోంగూరను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుకునేలా చేయడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందలో ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. డ్యామేజ్ అయిన హేయిర్ ఆరోగ్యంగా ఉంటుంది.
గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.