వేపుళ్లు చేసినప్పుడు కిచెన్ అంతా పొగతో కమ్ముకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఓ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. పొగ సమస్య ఉండదు. వేపుళ్లు క్రిస్పీగా కూడా వస్తాయి.
Image credits: Getty
Telugu
పొగ కంట్రోల్ అవుతుంది
నూనె వేడెక్కుతున్నప్పుడు అందులో ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఇది నూనె నుంచి ఎక్కువగా పొగ రాకుండా కంట్రోల్ చేస్తుంది.
Image credits: freepik
Telugu
నూనె శుభ్రంగా ఉంటుంది
ఇలా చేయడం వల్ల వేయించేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అడుక్కి చేరి నూనె తొందరగా మురికిగా మారదు. దీంతో నూనె ఎక్కువసేపు శుభ్రంగా కనిపిస్తుంది.
Image credits: freepik
Telugu
రుచి, కరకరలాడేలా...
ఈ విధంగా ఉప్పు వేసి వేయించడం వల్ల పూరీలు, పకోడీలు, కచోరీలు మరింత కరకరలాడుతూ (క్రిస్పీగా) వస్తాయి. రుచి కూడా అదిరిపోతుంది.
Image credits: Freepik
Telugu
వేగంగా వేగుతాయి
ఈ ట్రిక్ వల్ల నూనె ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. అందుకే పదార్థాలు తొందరగా, సరిగ్గా వేగుతాయి.
Image credits: stockPhoto
Telugu
ఎప్పుడు కలపాలి?
నూనె మరీ ఎక్కువగా వేడెక్కకముందే (అంటే నూనె వేడెక్కడం మొదలైన వెంటనే) ఉప్పు కలపాలి. దీనివల్ల నూనె మాడిపోయే ప్రమాదం తగ్గుతుంది.