Food

బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా?

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

Image credits: Pinterest

బెల్లం

చక్కెర కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. దీనిలో ఇనుము, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

బెల్లం తింటే మన శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితమవుతాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అలాగే మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

Image credits: Pinterest

పీరియడ్స్ నొప్పులను తగ్గిస్తుంది

బెల్లం పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఇనుము, ఫోలేట్ రక్త ప్రసరణను మెరుగుపరిచి పీరియడ్స్ నొప్పిని, మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి బెల్లం చాలా మంచిది. బెల్లాన్ని క్రమం తప్పకుండా తింటే మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.  

Image credits: social media

జలుబు, దగ్గును తగ్గిస్తుంది

బెల్లం దగ్గు, జలుబును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి.  

Image credits: social media

శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది

బెల్లాన్ని తింటే ఆస్తమా, బ్రోన్కైటిస్, అలెర్జీ వంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. 

Image credits: Freepik

తీపి పదార్థాలపై కోరికను తగ్గిస్తుంది

బెల్లం ఒక సహజ తీపి పదార్థం. ఇది ఇతర తీపి పదార్థాలపై కోరికను నియంత్రించడానికి, కేలరీలు తీసుకోవడం తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: google
Find Next One