Food
దీపావళి పండుగ పిల్లలకు కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టమైన పండుగ. మరి ఈ పండుగ స్పెషల్ రవ్వ లడ్డూను ఎలా సులువుగా, టేస్టీగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూ తయారుచేయడానికి 200 గ్రాముల రవ్వ అవసరం. ఈ లడ్డూ తయారుచేయడానికి రవ్వే ఎక్కువ అవసరమవుతుంది.
రవ్వ లడ్డు తయారుచేయడానికి రవ్వతో పాటుగా పంచదార అవసరం. ఇందుకోసం 150 గ్రాముల పంచదార అవసరపడుతుంది.
ఇకపోతే రవ్వలడ్డు టేస్టీగా కావాలంటే నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అవసరమవుతుంది.
రవ్వ లడ్డూలకు మంచి వాసన, టేస్ట్ బాగా వచ్చేలా చేయడానికి యాలకులు కూడా అవసరమవుతాయి. ఇందుకోసం రెండు యాలకులు సరిపోతాయి.
రవ్వ లడ్డూ చేయడానికి పై వాటితో పాటుగా పాలు కూడా చాలా అవసరం. ఇందుకోసం 100 మి.లీ పాలు అవసరపడతాయి.
రవ్వలడ్డూను మరింత టేస్టీగా చేయడానికి నట్స్ కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం 10 జీడిపప్పులు, 20 గ్రాముల ఎండుద్రాక్ష అవసరపడతాయి.
రవ్వ లడ్డు తయారుచేయడానికి ముందుగా నెయ్యిలో జీడిపప్పులను వేయించాలి. ఆ తర్వాత దాంట్లోనే రవ్వను కూడా బాగా వేయించాలి.
బాగా వేగిన రవ్వలోనే యాలకుల పొడి, పంచదార పొడిని వేసి పాలు పోసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష, జీడిపప్పులను వేసి వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలను తయారుచేయాలి. అంతే ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు తయారైనట్టే.