Food
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గి, మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం ఏం తినాలంటే?
వాల్ నట్స్ లో మన గుండెను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ప్రతిరోజూ వాల్ నట్స్ ను తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గి మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ లో మన గుండెకు మేలు చేస్తే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టోస్ట్, ఉడికించిన కూరగాయలు, సలాడ్లలో ఈ నూనెను వేసుకుని తినొచ్చు.
ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నట్స్ లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ గుండెకు ఎలాంటి రిస్క్ ఉండదు.
నారింజ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
బఠానీలు, బీన్స్, శెనగలు, పప్పులు, బఠానీలు వంటివి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది.
ఆకు కూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడానికి, ధమనులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
వెల్లుల్లి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే అల్లిసిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.