వెల్లుల్లిలో వైరస్ నిరోధక, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లను నివరించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది.
మీరు నిరంతరం అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటే, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగండి. మీ సమస్య తగ్గిపోయినట్లే..
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగితే శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలను బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగితే బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేస్తుంది, జీవక్రియను పెంచుతుంది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగితే అధిక రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
వెల్లుల్లి రసం రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది, మొటిమలు రాకుండా నివారిస్తుంది.
కొన్ని వెల్లుల్లి రెబ్బలను బాగా చూర్ణం చేసి ఆ పేస్ట్ నుండి రసాన్ని పిండి తీయండి. దీన్ని మీరు నేరుగా లేదా కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు.