విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో కూడిన ధాన్యం మొక్కజొన్న.
మొక్కజొన్నలో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఇనుము వంటివి ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.
మొక్కజొన్న తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఒక కప్పు మొక్కజొన్నలో దాదాపు 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
మొక్కజొన్నను తరచుగా తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ శోషణ తగ్గుతుంది, ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది.
మొక్కజొన్నలో నారలు కూడా ఉంటాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
గర్భధారణ సమయంలో మొక్కజొన్న తినడం తల్లికి, బిడ్డకు మంచిది. గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
అధిక రక్తపోటును నివారించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న మొక్కజొన్న సహాయపడుతుంది.
మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, లైకోపీన్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గించడానికి కూడా మొక్కజొన్న సహాయపడుతుంది.