పండ్లలో ఉన్నన్ని పీచు పదార్థాలు జ్యూస్ లో ఉండవు. పండ్లను అలాగే తింటే మలబద్దకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. కానీ జ్యూస్ లో పీచు పదార్థాలు మాత్రం ఉండవు.
Telugu
చక్కెర, కేలరీలు పెరుగుతాయి
పండ్లలో నేచురల్ షుగర్ ఉంటుంది. ఇది నెమ్మదిగా శరీరంలోకి వెళుతుంది. కానీ జ్యూస్ లల్లో మాత్రం షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తొందరగా జీర్ణమై బ్లడ్ షుగర్ ను పెంచుతుంది.
Telugu
తొందరగా ఆకలి అవుతుంది
పండ్లను తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ ఆకలి వేయదు. అదే జ్యూస్ తాగితే తొందరగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే దీనిలో పీచు పదార్థాలు ఉండవు.
Telugu
బరువు తగ్గడం కష్టం
పండ్లలో ఉండే పీచు, తక్కువ కేలరీలు మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. కానీ జ్యూస్ లల్లో కేలరీలు ఎక్కువగా పీచు తక్కువగా ఉంటుంది. వీటిని తాగితే మీరు బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.
Telugu
పోషకాలు తగ్గిపోతాయి
పండ్లను తింటే మీ శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా అందుతాయి. అదే పండ్లను జ్యూస్ చేస్తే దానిలో పోషకాలు తగ్గుతాయి.
Telugu
పళ్లకు హాని
పండ్లలో ఉండే నేచురల్ షుగర్స్ మనకు పెద్దగా హాని చేయవు. కానీ జ్యూస్ లల్లో చక్కెరలు, ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన పళ్ల ఎనామిల్ ను దెబ్బతీస్తాయి.