కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ...బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు
Telugu
ఊతప్పం
కూరగాయలు ఎక్కువగా వేసి ఉతప్పం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. క్యాలరీలు 120 ఉండొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ తక్కువగా ఉండే చట్నీ తో తినొచ్చు.
Telugu
నోరూరించే పొంగల్
ఒక గిన్నె పొంగల్ లో దాదాపు 200-250 కేలరీలు. బియ్యం, పెసరపప్పుతో తయారైన ఈ వంట తేలికైనది, పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని పుదీనా చట్నీ లేదా సాంబార్ తో తినండి.
Telugu
సాదా దోశ
ఒక దోశలో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. క్రిస్పీ దోశ గ్లూటెన్ రహిత, తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో తినండి.
Telugu
రాగి దోశ
ఒక రాగి దోశలో దాదాపు 100 కేలరీలు. రాగి గ్లూటెన్ రహిత, ఐరన్ తో నిండి ఉంటుంది. దీన్ని తక్కువ ఫ్యాట్ ఉండే చట్నీతో తినండి.
Telugu
ఉప్మా తినండి
ఒక గిన్నె ఉప్మాలో దాదాపు 200 కేలరీలు. రవ్వ, కూరగాయలు, మసాలా దినుసులతో నిండిన ఉప్మా ఆరోగ్యకరమైన ఫైబర్, శక్తిని ఇస్తుంది. దీనిపై నిమ్మరసం పిండి తినండి.
Image credits: Getty
Telugu
ఇడ్లీ ట్రై చేయండి
ఒక ఇడ్లీలో దాదాపు 39 కేలరీలు ఉంటాయి. ఇది ఆవిరి మీద ఉడికించినది, తక్కువ నూనె కలిగి ఉంటుంది, జీర్ణం చేసుకోవడం సులభం. దీన్ని సాంబార్, కొబ్బరి చట్నీతో తినండి.రెండుకంటే ఎక్కువ తినొద్దు
Telugu
అప్పాలు కూడా తినండి
అప్పాలను పప్పు, రవ్వ, బియ్యం పిండితో అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. కేలరీలు తక్కువగా ఉంటాయి.