Food
పచ్చని యాలకులు కొంచెం తీయగా, మసాలా రుచిని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా టీ, స్వీట్లతో పాటుగా వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు.
నల్ల యాలకులు సోంపు లాగా తీయగా, వాసనను కలిగి ఉంటాయి. వీటిని సాధారణంగా కూర, బిర్యానీ వంటి రుచికరమైన వంటల్లో ఉపయోగిస్తారు.
పచ్చని యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో డైటరీ ఫైబర్, కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
నల్ల యాలకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ విటమిన్ సి, పొటాషియం లు కూడా ఉంటాయి.
పచ్చ యాలకులు మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. నోటిని శుభ్రపరుస్తాయి.
నల్ల యాలకులు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఉబ్బసం సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
పచ్చ యాలకులు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని వేసవిలో తీసుకోవాలి. నల్ల యాలకులు వేడి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని శీతాకాలంలో తీసుకోవాలి.
ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే నల్ల యాలకులను తీసుకోండి. నిద్రలేమి, ఒత్తిడి మొదలైన వాటిని తగ్గించుకోవడానికి పచ్చ యాలకులను తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.