కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ఇలా నిల్వ చేస్తే చాలు
కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కాయగూరలేమో ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడైపోతున్నాయి. మరి, ఎలా నిల్వ చేస్తే.. ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం
టమాటాకు టేప్ అతికించండి
టమాటాకు ఉన్న కాడ తీసేసి ఆ చోట టేప్ అతికించండి. దీనివల్ల టమాటాలు త్వరగా పాడవ్వవు.
ఉల్లిపాయలను పేపర్‌లో ఉంచండి
ఉల్లిపాయలను పేపర్ ముక్కల్లో ఉంచి గాలి, వెలుతురు తగిలే చోట ఉంచండి. దీనివల్ల ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
అల్లంను పసుపు నీటిలో ఉంచండి
అల్లంను పసుపు నీటిలో ముంచి తీసి టిష్యూ పేపర్‌లో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచండి. ఇలా చేస్తే అల్లం మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది.
బంగాళాదుంపలతో ఆపిల్ ఉంచండి
బంగాళాదుంపలను నిల్వ చేసేటప్పుడు వాటితో కొన్ని ఆపిల్ పండ్లు ఉంచండి. దీనివల్ల బంగాళాదుంపలు తొందరగా మొలకెత్తవు.
వెల్లుల్లిని టీపొడి, ఉప్పుతో నిల్వ చేయండి
వెల్లుల్లిని ఎండిన టీపొడి, ఉప్పుతో కలిపి జిప్ లాక్ కవర్‌లో ఉంచండి. దీనివల్ల వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.