Food
తేనె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే మాత్రం హానికరం. ఈ ఆహారాలేంటో తెలుసుకుందాం.
వేడినీటిలో తేనె కలపడం వల్ల దాని ప్రభావం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇది కొంతమందిలో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
దోసకాయ తేనె కలిపి తినడం మానుకోండి. దోసకాయ తేనెతో కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తేనె, నెయ్యి కలిపి తినడం వల్ల జుట్టు రాలడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని 2020లో టాక్సికాలజీ రిపోర్టులో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.
చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలతో పాటు తేనె తినకూడదు. ఇది వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మామిడి, పైనాపిల్ వంటి పండ్లతో తేనె కలిపి తినడం మానుకోండి. ఇవి ప్రజలలో, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో, చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.