Food

మెక్‌డొనాల్డ్స్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఈజీగ ఇంట్లోనే తయారు చేయొచ్చు

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావలసినవి

4 నుంచి 5 పెద్దసైజు బంగాళాదుంపలు, వాటర్ (నానబెట్టడానికి), 2 పెద్ద స్పూన్ల వైట్ వెనిగర్, రుచికి సరిపడా ఉప్పు, ఐస్ ముక్కలు, వేయించడానికి నూనె.

బంగాళాదుంపలు

ఫ్రెంచ్ ఫ్రైస్ ను తయారు చేయడానికి ముందుగా బంగాళాదుంపలను తొక్క తీసి, సన్నగా, సమానంగా ముక్కలుగా (సుమారు 1/4 అంగుళాల మందం) కట్ చేసుకోండి.

చల్లటి నీటిలో నానబెట్టండి

కోసిన ఆలుగడ్డ ముక్కలను చల్లటి నీటితో నిండిన పెద్ద గిన్నెలో ఉంచండి. ఈ వాటర్ కు వెనిగర్, కొన్ని ఐస్ ముక్కలను జోడించండి. వెనిగర్ మక్కలను గోధుమ రంగులోకి మారకుండా, క్రిస్పీగా చేస్తుంది.

30 నిమిషాలు నాననివ్వండి

బంగాళాదుంపలను కనీసం 30 నిమిషాలు నాననివ్వండి. ఇది బంగాళాదుంపల నుంచి అదనపు పిండి పదార్థాలను తొలగిస్తుంది. అలాగే ఫ్రైస్ వేయించేటప్పుడు క్రిస్పీగా ఉండటానికి సహాయపడుతుంది.

ఫ్రైస్‌ను ఉడికించడం

ఆలుగడ్డలను నీళ్ల నుంచి తీసి ఒక పెద్ద పాత్రలో నూనె వేడి చేసి ఫ్రైస్‌ను బ్యాచ్‌లుగా వేయించండి.ఇవి లేతగా, కొద్దిగా మెత్తగా అయ్యే వరకు 4-5 నిమిషాలు ఉడికించండి. 

50% ఉడికించిన ఫ్రైస్

బంగాళాదుంపలు 50% ఉడికిన తర్వాత ఫ్రైస్‌ను బయటకు తీసి కాగితపు టవల్ మీద ఆరనివ్వండి. అవి పూర్తిగా చల్లారనివ్వండి.

మళ్ళీ వేయించండి

నూనె వేడిని పెంచి ఉడికించిన ఫ్రైస్‌ను మళ్లీ బ్యాచ్‌లుగా 2-3 నిమిషాలు లేదా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఫ్రైస్‌ను నూనె నుంచి తీసివేసి వెంటనే ఉప్పు చల్లండి

వేడి వేడిగా సర్వ్ చేయండి

అంతే వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే. దీన్ని మీకు ఇష్టమైన డిప్పింగ్ సాస్‌ లేదా కెచప్ వంటి వాటితో తినండి. టేస్ట్ అదిరిపోతుంది. 

సూచనలు

మెక్‌డొనాల్డ్స్ వంటి ఫ్రైస్ తయారు చేయడానికి, బంగాళాదుంపలను చిన్న బ్యాచ్‌లుగా వేయించాలి. నూనె వేడి సరిగ్గా ఉండాలి. అయితే చల్లబడిన తర్వాత బాగా వేయించాలి.

Find Next One