కీరదోసకాయ, పెరుగు రెండూ చల్లని గుణాలు కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే దగ్గు, శ్లేష్మం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియను కూడా నెమ్మదిస్తుంది.
Telugu
టమాట తినొద్దు..
కీరదోసకాయలో క్లార గుణం, టమాటలో ఆమ్ల గుణం ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఆమ్ల-క్షార ప్రతిచర్య ఏర్పడుతుంది. దీని వల్ల అజీర్తి, గుండెల్ల మంట వచ్చే అవకాశం ఉంది.
Telugu
ఉప్పు, మసాలా దినుసులు
కీరదోసకాయ తినేటప్పుడు ఎక్కువ ఉప్పు , మసాలా దినుసులు వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి కీరదోస ఆరోగ్యకరమైన అంశాలను బలహీనపరుస్తాయి, శరీరంలో నీటి కొరతను కలిగిస్తాయి.
Telugu
నీరు తాగవచ్చా?
కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల, దానిని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ సమస్యను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్య పెరుగుతుంది.
Telugu
ఎలా, ఎప్పుడు తినాలి?
కీరదోసకాయను పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత తినడం మంచిది.
Telugu
ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఉదయం ఖాళీ కడుపుతో కీరదోసకాయ తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
Telugu
గమనిక
కీరదోసకాయను కొన్న వెంటనే శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఎందుకంటే దానిపై రసాయనాలు, మైనం వంటివి పేరుకుని ఉండవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.