శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. మనం తినే ఆహారం కాలేయం ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతుంది.
కొన్ని ఆహారాలు కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవే ఆహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎక్కువగా చక్కెర కలిగిన ఆహారాలు కాలేయానికి మంచిది కాదు. ఎందుకంటే కాలేయం చక్కెరను కొవ్వుగా మారుస్తుంది.
సోడా, కూల్ డ్రింక్స్ కూడా కాలేయానికి ప్రమాదమే. తీపి పానీయాలు ఊబకాయానికి, కొవ్వు పెరగడానికి కారణం అవుతాయి.
ఎక్కువగా ఉప్పు వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. చిప్స్, ఉప్పు బిస్కెట్లలో సోడియం, కొవ్వు ఎక్కువ.
బీఫ్, పంది మాంసం వంటి రెడ్ మీట్ కాలేయానికి మంచిది కాదు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువగా మద్యం తాగితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, లివర్ సిర్రోసిస్ వంటి రోగాలు వస్తాయి.
పిజ్జా, పాస్తా కూడా కొందరిలో ఎసిడిటీని కలిగిస్తాయి. అందుకే వాటిని తినకుండా ఉంటే మంచిది.
గుమ్మడి గింజలతో ఇన్ని ప్రయోజనాలున్నాయా?
రోజూ స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుందో తెలుసా?
Carrot: రోజూ క్యారెట్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
Health tips: రోజూ పచ్చడి తింటే ఏమవుతుందో తెలుసా?