నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే చపాతీలు మెత్తగా వచ్చేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం పిండిలో కొంచెం నెయ్యి వేసి కలపండి.
Image credits: others
పెరుగు
పెరుగుతో కూడా చపాతీలు సాఫ్ట్ గా, మెత్తగా, టేస్టీగా తయారవుతాయి. ఇందుకోసం మీరు పిండిలో కొంచెం పెరుగును వేసి కలిపి గంటపాటు పక్కన పెట్టుకోండి.
Image credits: Getty
వేడి నీళ్లు
సాధారణంగా మనం నార్మల్ వాటర్ తోనే చపాతీ పిండిని కలుపుతుంటాం. అయితే ఈ నార్మల్ వాటర్ కు బదులుగా వేడి నీళ్లతో పిండిని కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి.
Image credits: others
నూనె
చపాతీ పిండిలో కొంచెం నూనె వేసి పిండిని కలుపుకోండి. ఎందుకంటే దీనివల్ల మీరు చేసిన చపాతీలు మెత్తగా ఉంటాయి.
Image credits: Getty
పాలు
చపాతీ పిండిలో పాలను కూడా కలపొచ్చు. నీళ్లతో పాటుగా గోరువెచ్చని పాలను కొన్నింటితో పిండిని కలపండి. పాలు కూడా చపాతీలు మెత్తగా అయ్యేలా చేస్తాయి.