Food
వాల్ నట్స్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.
బ్లూ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
డార్క్ చాక్లెట్లు కూడా బ్రెయిన్ హెల్త్ కు సహాయపడతాయి. వీటిలో కోకో, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి.
గుమ్మడి కాయ గింజలు కూడా మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఇనుము, మెగ్నీషియం, జింక్, రాగి వంటి పోషకాలుంటాయి. ఇవన్నీ మన బ్రెయిన్ ను హెల్తీగా ఉంచుతాయి.
గుడ్లలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. రోజూ ఒక గుడ్డును తిన్నా మీ మెదడు బాగా పనిచేస్తుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది.
ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ వంటి ఆకు కూరల్లో ఉండే విటమిన్ కె,యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు మెదడుకి మంచిది.
చేపలు కూడా బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.అవీ ఇవీ కాకుండా.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న సాల్మన్ వంటి చేపలను తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.