Food
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయినా షుగర్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి.
ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఈ పండ్లను ఎక్కువగా తాగకూడదు.
మామిడి పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను బాగా పెంచుతాయి.
చెర్రీ పండ్లలో కూడా షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్నా బ్లడ్ షుగర్ బాగా పెరుగుతుంది. అందుకే వీటిని తినకూడదంటారు.
డయాబెటీస్ పేషెంట్లకు పైనాపిల్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ పండులో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని తినకూడదంటారు.
డయాబెటీస్ ఉన్నవారు నారింజ పండ్లను ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
షుగర్ ఉన్నవారు పుచ్చకాయను కూడా ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి.
ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదంటారు.
అంజీర పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. కానీ వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను ఎక్కువగా తినకూడదంటారు.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయాలి.