Food
గుడ్డు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో చాలా మంది గుడ్లకు దూరంగా ఉంటారు. మరి దీనిలో నిజమెంతంటే?
గుడ్డులో ఉండే ఎన్నో పోషకాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
గుడ్డులో మెదడు పనితీరును మెరుగుపరిచే కోలిన్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు, వివిధ రకాల ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.
రోజూ ఒక గుడ్డును తినే వారికి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువ అని జర్నల్ ఆఫ్ హార్ట్ ప్రచురించిన అధ్యయనంలో తేలింది.
గుడ్డులో యాంటీఆక్సిడెంట్లు ల్యూటిన్, జియాక్సంతిన్ లు మెండుగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
ఇకపోతే గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంతో గుడ్డును తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ కొంతమొత్తంలో ఉంటుంది. ఒక పెద్ద సైజు గుడ్డులో దాదాపు 186 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది.
అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
గుడ్డు తరచుగా తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ అని చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది.
పలు పరిశోధనల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తినడం చాలా సురక్షితం.
వెన్న, జున్ను, పేస్ట్రీ వంటి ఆహారాల్లో ఉండే సంతృప్త కొవ్వులే గుడ్డు కంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.