Food
శరీర బరువు పెరగడానికి అసలు కారణం తినే ఆహారమే. అందుకే ఏం తింటే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పేస్ట్రీ, డోనట్, కుకీస్‌లు తింటే కూడా మీరు బాగా బరువు పెరుగుతారు. వీటిలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
శుద్ధి చేసిన ధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీ బ్లడ్ షుగర్ పెరగడమే కాకుండా.. ఒంట్లో కొవ్వు కూడా పేరుకుపోతుంది.
నూనెలో వేయించిన ఆహారాలను తింటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మీ పొట్టలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
పిజ్జా, బర్గర్‌లను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మీ బరువు పెరిగేలా చేస్తుంది.
మందు తాగే వారు కూడా బాగా బరువు పెరుగుతారు. ఎందుకంటే మందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పొట్టను బాగా పెంచుతాయి.
పీనట్ బటర్ కూడా మీ బరువును బాగా పెంచుతుంి. ఎందుకంటే దీనిలో మోనో-పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.
ఆలు చిప్స్ ను తింటే కూడా మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
చీజ్, వెన్నలను ఎక్కువగా తిన్నా కూడా మీరు బరువు బాగా పెరుగుతారు. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీలు మీ పొట్టలో పేరుకుపోతాయి.