గుడ్డులో జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకాలు ఉంటాయి.
గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండింటిలోనూ బయోటిన్ ఉంటుంది. అయితే పచ్చసొనలో ఎక్కువ బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి గుడ్డులు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలకు సహాయపడే జింక్ కూడా గుడ్డులో ఉంటుంది. గుడ్డులో జింక్ అధికంగా ఉంటుంది,
గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదల, చర్మం ఆరోగ్యానికి సహాయపడుతుంది
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఐరన్ అవసరం, గుడ్డులో ఐరన్ అధికంగా ఉంటుంది.
గుడ్డులో ఉండే సెలీనియం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఆరోగ్య నిపుణుల లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోండి.