మీరు తాగే వేడి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగండి. దీనివల్ల జీర్ణ సమస్యలుండవ్. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చర్మ వాపు కూడా తగ్గుతుంది.
పాలలో తేనెను కలుపుకుని తాగితే చాలా మంచిది. ఎందుకంటే తేనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి.
అవును పాలలో యాలకులను కూడా కలుపుకోవచ్చు. వీటిని కలిపిన పాలను తాగితే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్దకం వంటి సమస్యలు రావు.
పాలలో అల్లం కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే జలుబు, ఇన్ఫెక్షన్లు తొందరగా తగ్గుతాయి.
చిటికెడు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల మీరెన్నో ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా ఇది చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలలో వెల్లుల్లిని కూడా కలుపుకుని తాగొచ్చు. దీనివల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.