Food
చలికాలంలో నల్ల నువ్వుల లడ్డూను తింటే చలి ఎక్కువగా పెట్టదు. దీనిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచుతాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ లడ్డూ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
నల్ల నువ్వులు: 1 కప్పు
సన్నగా తరిగిన బెల్లం: 1 కప్పు
వేయించిన పల్లీలు: 1/2 కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
నవ్వుల లడ్డూ తయారుచేయడానికి నువ్వులను తక్కువ మంట మీద చిటపటలాడేవరకు వేయించి వీటిని చల్లారనివ్వండి.
ఆ తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి అందులో తురిమిన బెల్లాన్ని వేసి తక్కువ మంట మీద కరిగించండి. కానీ దీన్ని ఎక్కువ సేపు ఉడికించకండి.
కరిగిన బెల్లం పానకంటే వేయించిన నువ్వులు, పల్లీలు వేసి బాగా కలపండి. ఇది చల్లారిన తర్వాత, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలను తయారుచేయండి.
ఈ నువ్వుల లడ్డూలను గాలి వెల్లని డబ్బాలో పెట్టండి. దీనివల్ల అవి 10-15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. రోజూ ఒకటి లేదా రెండు లడ్డూలు తినండి. మీకు చలి తక్కువగా పెడుతుంది. హెల్తీగా ఉంటారు.