వేసవిలో బాగా పండిన మామిడి పండ్లను తినడం ఉత్తమం. 30 నిమిషాల పాటు నీటిలో నానపెట్టి తినాలి. ఏదైనా ఆహారం తిన్న గంట తర్వాత ఈ పండు తినొచ్చు.
ఉదయం ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తింటే అసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. దీనిలో ఉండే చక్కెర జీర్ణక్రియను చెడగొడుతుంది.
రాత్రి మామిడి పండ్లు తింటే జీర్ణం కావడం కష్టం. అదనపు చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతుంది, నిద్రను ప్రభావితం చేస్తుంది.
తిన్న వెంటనే మామిడి పండ్లు తింటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల గ్యాస్, అజీర్తి, వాపు వంటి సమస్యలు వస్తాయి.
రోజుకు ఎక్కువ మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేసి, చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.
వ్యాయామం తర్వాత చెమట పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే మామిడి పండ్లు తింటే శరీరంలో వేడిని పెంచి, డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది.
గొంతు నొప్పి లేదా జలుబు సమస్య ఉన్నప్పుడు మామిడి పండ్లు తింటే సమస్య మరింత పెరుగుతుంది.
ఉసిరికాయతో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు
Jack fruit: చాలా ఈజీగా, పర్ఫెక్ట్ గా.. పనసకాయను కోసేయండిలా!
Cholesterol: కొలెస్ట్రాల్‌కు కళ్లెం వేయాలంటే.. ఈ ఆహారం తినాల్సిందే !