Food
టీవీ, ఫోన్ చూస్తూ స్నాక్స్ ను తినే అలవాటు చాలా మంది ఉంటుంది. ఈ స్నాక్స్ గా చిప్స్ ను, బిస్కెట్లను మాత్రం అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట చిప్స్, బిస్కెట్లను గనుక తింటే మీకు గుండెజబ్బులు వస్తాయి. అలాగే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
రాత్రిపూట ఐస్ క్రీం, స్వీట్లు, చిప్స్, బిస్కెట్లను తింటే రాత్రిపూట నిద్రపట్టదు. అలాగే బరువు కూడా పెరుగుతారు. అలాగే లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అందుకే రాత్రిపూట ఏ స్నాక్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, తొందరగా నిద్రపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాల్ నట్స్ మంచి హెల్తీ ఫుడ్స్. వీటితో పాటుగా మీరు రాత్రిపూట బాదం పప్పులను కూడా తినొచ్చు. వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం మీకు రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
రాత్రిపూట మీరు వెజిటేబుల్ సూప్ ను కూడా తాగొచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగినా మీకు రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు హెల్తీగా అంటే జలుబు లేకుండా ఉండే కీరదోసకాయను మిరియాలతో తినండి. దీనివల్ల మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుంది.
ఆపిల్ ను రాత్రిపూటైనా ఎంచక్కా తినొచ్చు. ఈ పండు మీకు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.
ఈ స్నాక్స్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఫైబర్, ప్రోటీన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
అంతేకాకుండా ఈ స్నాక్స్ మంచి ఆరోగ్యకరమైనవి. పోషకమైనవి, ముఖ్యంగా చాలా తొందరగా, సులువుగా జీర్ణమవుతాయి.