Food
యాపిల్‌లో బయోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మొదళ్లు బలపడేందుకు ఎంతో ఉపయోగపడతాయి.
నిమ్మకాయ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే కాలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
అరటి పండులోని పొటాషియం, విటమిన్ బీ6, సిలికా జుట్టు బలంగా మారడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
పైనాపిల్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దోహదపడుతుంది.
వాటర్ మిలాన్‌లో అధికంగా ఉండే నీటి శాతం తల చర్మానికి తేమగా ఉంచుతుంది. విటమిన్ ఏ, సీ, మెగ్నీషియం వెంట్రుకల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
సమ్మర్‌లో లభించే మామిడి కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఏ తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పొడిగా మారకుండా కాపాడుతుంది.
పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.