Food
కోడి గుడ్లో ప్రోటీన్లు, కాల్షియం, అమైనో ఆమ్లాలు, భాస్వరం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కోడిగుడ్లను ఉదయం పరిగడుపున తినడం చాలా మంచిది. ఇవి మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.
గుడ్డులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రోజూ ఉదయాన్నే పరిగడుపున తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు.
పరిగడుపున కోడిగుడ్డును తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రెగ్యులర్ గా మీరు పరిగడుపున గుడ్డును తింటే మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. దీంతో మీరు రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పరిగడుపున గుడ్డును తింటే మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మీరు బాగా ఆలోచించగలుగుతారు.
రెగ్యలర్ గా పరిగడుపున కోడి గుడ్డును తింటే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.