Food
రెగ్యులర్ గా మనం వంటలో వాడేది ఈ టేబుల్ సాల్ట్. దీనిలో అయోడిన్ ఉంటుంది. థైరాయిడ్ పనితీరుకు ఇది చాలా అవసరం.
సముద్రపు ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ కంటే దీని రుచి కాస్త ఎక్కువ. వంటలో వాడతారు.
హిమాలయన్ పింక్ సాల్ట్ హిమాలయాలలో దొరుకుతుంది. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలం. శరీర pH స్థాయిని సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కోషర్ ఉప్పులో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి. దీన్ని సాధారణంగా మసాలా, మాంసం గ్రేవీల తయారీలో వాడతారు.
సెల్టిక్ సముద్రపు ఉప్పులో మెగ్నీషియం ఎక్కువ. ఇది కండరాలకు మంచిది. స్నానపు నీటిలో కూడా వాడొచ్చు.
నల్ల ఉప్పు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మంచిది, శరీరంలో వాపు తగ్గిస్తుంది.
ఎర్ర హవాయియన్ ఉప్పును అలేయా ఉప్పు అని కూడా అంటారు. ఇందులో అగ్నిపర్వత మట్టి ఉంటుంది, ఇది ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలను పెంచుతుంది.
సైంధవ ఉప్పులో అయోడిన్ తక్కువ. దీన్ని సాధారణంగా ఉపవాస సమయంలో వాడతారు.