Food
రోజూ మూడు వాల్ నట్స్ ను తింటే వీటిలో ఉండే ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఇతర పోషకాలు మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
వాల్ నట్స్ ను తింటే మీ శరీరంలో ఉన్న అదనపు కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.
వాల్ నట్స్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
డయాబెటీస్ పేషెంట్లకు వాల్ నట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. వాల్ నట్స్ ను తింటే టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
వాల్ నట్స్ జీర్ణక్రియకు కూడా మంచి మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
వాల్ నట్స్ లో మెగ్నీషియంతో పాటుగా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
రోజుకు మూడు వాల్ నట్స్ ను తిన్నా మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ మీ ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వాల్ నట్స్ ను తింటే మీ చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్లు చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.