Food

ఇవి తింటే గుండె జబ్బులు రావు

Image credits: social media

గుండె ఆరోగ్యం

ఆరోగ్యకరమైన ఆహారం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం కోసం యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు, ఫైబర్ ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తినాలి. 

Image credits: Getty

చెడు కొలెస్ట్రాల్

కొన్ని రకాల ఆహారాలను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో  ఉంటుంది. ఇందుకోసం ఏం తినాలంటే? 

Image credits: Getty

ఆకుకూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రకరకాల ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలెట్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

నారింజ పండ్లు

నారింజ పండ్లు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండెను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty

నట్స్

నట్స్ ఒక్క గుండెనే కాదు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నట్స్ లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, మెగ్నీషియంలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image credits: Getty

దానిమ్మ

దానిమ్మ పండు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్ లో ఉంటాయి. దీంతో మీకు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

Image credits: freepik

క్యారెట్

క్యారెట్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సమాయపడుతుంది. దీనిలో ఫైబర్, బీటా కెరోటిన్, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా

పిండిలో ఇదొక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా, తెల్లగా ఉంటాయి

మటన్ లివర్ తింటే ఏమౌతుందో తెలుసా?

అంజీర్ లో పురుగులు ఉంటాయా?