వెల్లుల్లి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ప్రతిరోజూ పరిగడుపున వెల్లుల్లి వాటర్ ను తాగితే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే కడుపులో ఇన్ఫెక్షన్లు కూడా నయమవుతాయి.
వెల్లుల్లి నీళ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ నీళ్లు తాగితే రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. దీంతో మీరు గుండె జబ్బులకు దూరంగా ఉంటారు.
వెల్లుల్లి వాటర్ లో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ కు దూరంగా ఉంచుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని శ్వాసకోశ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తాయి.
మీరు ప్రతిరోజూ పరిగడుపున వెల్లుల్లి వాటర్ ను తాగినా బరువు తగ్గుతారు. ఇది ఎక్స్ ట్రా కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి భయం లేకుండా తాగొచ్చు.
వెల్లుల్లి వాటర్ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హెల్తీగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంచుతుంది.