Food
అరటి పండులో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండును పరిగడుపున తింటే మన శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.
అరటిలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండును ఉదయాన్నే తింటే హై బీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అరటిపండులో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల ఈ పండును ఉదయాన్నే తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. ఈ పండు జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పరిగడుపున అరటిపండును తినడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
అరటి పండును తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే కొంతమంది పరిగడుపున అరటిపండును తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ిన పరిగడుపున తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అరటిపండును ఏదైనా తిన్న తర్వాతే తినడం మంచిది. .