Food
చలికాలంలో నువ్వులను తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో ఇనుముతో పాటుగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వు, సంతృప్త కొవ్వులు మెండుగా ఉంటాయి. అలాగే నువ్వులు కాల్షియం, ఐరనో లోపాన్నికూడా తీరుస్తాయి.దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నువ్వులను ఎక్కువగా తింటే కఫం,పిత్తం అసమతుల్యమవుతాయి. వీటిని రోజూ ఎక్కువగా తింటే పీరియడ్స్ లో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
నువ్వుల్లో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి.. వీటిని గర్భిణులు ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో నువ్వుల లడ్డూలను బాగా తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే వీటిని డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా తినొద్దంటారు.
నువ్వులకు అలెర్జీ చాలా మందికి ఉంటుంది. అందుకే వీటిని ఫస్ట్ టైం తింటున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అలెర్జీ శరీరమంతా వస్తుంది.
నువ్వులు జీర్ణ సమస్యలకు కూడా కారణమవుతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే సంతృప్త కొవ్వు కడుపు ఉబ్బరం, మలబంధం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.