Food
డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెపోటు దరిచేరనివ్వకుండా కాపాడడంలో ఉపయోగపడుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండడలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ పేషెంట్స్‌కి సైతం డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో షుగర్ కంటెంట్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే చర్మాన్ని అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం బారి నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.