Food

రాగులు

రాగులు పోషకాలకు మంచి వనరులు. వీటిలో మన శరీరానికి బలాన్నిచ్చే ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే మన మొత్తం ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

Image credits: Getty

వెయిట్ లాస్

రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

బ్లడ్ షుగర్

రాగుల్లో పాలీఫెనాల్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అందుకే వీటిని డయాబెటీస్ ఉన్నవాళ్లు తీసుకోవాలి. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

కొవ్వు

రాగుల్లో లెసిథిన్, మెథియోనిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని అదనపు కొవ్వును తొలగించడానికి బాగా సహాయపడతాయి.
 

Image credits: Getty

రాగి రొట్టెలు

బరువు తగ్గడానికి రాగి రొట్టెలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే రాగుల్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి మనల్ని బలంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

రాగులు

రాగుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు అతిగా తినకుండా ఉండటానికి, మీ ఆకలిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Find Next One