అరటిపండు బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం శరీరంలోని అదనపు సోడియాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది.
దానిమ్మ పండును తిన్నా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బెర్రీలు కూడా బీపీ పేషెంట్లకు చాలా మంచివి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. దీనిలో ఫైబర్ మెండుగా ఉంటుంది. దీన్ని తింటే కొవ్వు కరుగుతుంది. బీపీ తగ్గుతుంది.
వెల్లుల్లి బీపీ పేషెంట్లకు చాలా మంచిది. దీనిలో అల్లిసిన్ అనే సమ్మేళనం యాంటీ-హైపర్‌టెన్సివ్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
సార్డినెస్, సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయి.
ఆకుకూరలను బీపీ పేషెంట్లు బాగా తినాలి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్లు రక్తనాళాలను సడలించడానికి సహాయపడతాయి.
అవిసె గింజలు కూడా బీపీ పేషెంట్లకు చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.