అరటిపండును తింటే మీకు రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియంలు బాగా ఉంటాయి. ఇవి మీ కండరాలను సడలించి బాగా నిద్రవచ్చేలా చేస్తాయి.
కివి పండును తిన్నా మీకు బాగా నిద్రపడుతుంది. దీనిలో సెరోటోనిన్యాం, టీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మీకు నిద్రపట్టేలా చేయడానికి సహాయపడతాయి.
చెర్రీ పండ్లను తిన్నా బాగా నిద్రపడుతుంది. ఈ పండులో ఉండే మెలటోనిన్ మీ నిద్రచక్రాన్ని సరిచేస్తుంది.
బాదం పప్పు కూడా మీ నిద్రను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఈ పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం లు ఉంటాయి. ఇవి మీకు బాగా నిద్రపట్టేలా చేస్తాయి.
రాత్రిళ్లు వేడి వేడి పాలను తాగినా బాగా నిద్రపడుతుంది. పాలలో ఉండే కాల్షియం, ట్రిప్టోఫాన్ లు మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి మీకు నిద్రొచ్చేలా చేస్తాయి.
తేనె కూడా మీకు నిద్రపట్టేలా చేస్తాయి. ఇది సెరోటోనిన్, ట్రిప్టోఫాన్ పే పెంచి మీకు నిద్రవచ్చేలా చేస్తాయి. మిమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్ ను తిన్నా మీకు బాగా నిద్రపడుతుంది. దీనిలో ఉండే సెరోటోనిన్ మీ శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచి నిద్రొచ్చేలా చేస్తాయి.