Food

కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కారం ఎలా తగ్గించాలి?

వంటచేసే సమయంలో చిన్న చిన్న తప్పులు జరగడం కామన్. పొరపాటున కూరలో కారం ఎక్కువైతే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలు..

 

 

ఎక్కువ నీళ్ళు పోయండి

కూరలో ఎక్కువ నీళ్ళు లేదా ఉడకబెట్టిన నీళ్ళు పోయాలి. కారం తగ్గుతుంది. నీళ్లుపోసి కూర బాగా పలచగా మారితే శెనగపిండి కలిపితే.. మళ్లీ నార్మల్ అవుతుంది.

పుల్లటిది వేయండి

పుల్లటి పదార్థాలు కారాన్ని తగ్గిస్తాయి. వినెగర్, నిమ్మరసం,  చింతపండు వేయడం వల్ల కారం తగ్గి, కూర రుచి పెరుగుతుంది.

కూర పరిమాణం పెంచండి

కారం తగ్గించడానికి కూర పరిమాణం పెంచండి. బంగాళాదుంపలు వంటివి వేస్తే కారం తగ్గుతుంది.

కొబ్బరిపాలు, క్రీమ్ వాడండి

కొబ్బరిపాలు లేదా క్రీమ్ వాడటం వల్ల కారం తగ్గుతుంది. ఇది కూరకు మంచి రుచిని కూడా ఇస్తుంది.

తీపి వేయండి

చక్కెర లేదా బెల్లం వంటి తీపి పదార్థాలు కారాన్ని తగ్గిస్తాయి. కానీ ఎక్కువ తీపి వేయకూడదు.

జీడిపప్పు పేస్ట్ వాడండి

జీడిపప్పు, వాల్ నట్ పేస్ట్ లేదా వెన్న కూడా కారాన్ని తగ్గిస్తాయి. బాదం లేదా వేరుశనగ పేస్ట్ కూడా వాడవచ్చు.

రోజూ గుడ్డు తింటే గుండె జబ్బా..? ఇదెక్కడి బాధరా నాయనా!

కోడిగుడ్లను ఖాళీ కడుపుతో తింటే ఏమౌతుంది?

ఇవి తింటే జుట్టు రాలనే రాలదు

ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా?