Food
ఈ మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ తో బాధపడే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
ధూమపానం , మద్యపానాన్ని మానుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు తప్పనిసరిగా తినవలసిన కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.
సోయా ఉత్పత్తుల వినియోగం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని జెఎన్‌సిఐ క్యాన్సర్ స్పెక్ట్రం జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది.
గ్రీన్ టీలోని పాలీఫెనాల్ అయిన EGCG రొమ్ము క్యాన్సర్ , ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆకు కూరల్లో బీటా కెరోటిన్, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్తన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో ఫోలేట్, విటమిన్ సి, కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
విటమిన్ డి అధికంగా ఉండే పుట్టగొడుగులు స్తన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధించవచ్చు.
వివిధ రకాల బెర్రీ పండ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి