మీ ఇంట్లో కూడా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం పారేస్తారా? ఇక అలా చేయకండి! మిగిలిపోయిన అన్నంతో మీరు సులభమైన, ఆరోగ్యకరమైన పద్దతుల్లో ఈ రెసీపీలను ట్రై చేయవచ్చు.
మిగిలిపోయిన అన్నం, పెరుగు, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, తేలికపాటి ఉప్పు తీసుకోండి. అన్నం, పెరుగు కలపండి, పైన తాలింపు వేయండి.
మిగిలిపోయిన అన్నం, కొద్దిగా రవ్వ లేదా ఉడికించిన బంగాళాదుంప, పెరుగు, ఉప్పు కలిపి మిక్సీలో రుబ్బుకోండి. 5-20 నిమిషాల తర్వాత దోశ వేయండి. క్రిస్పీగా కాల్చండి, రైస్ దోశ సిద్ధం.
మిగిలిన అన్నం, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, సోయా సాస్, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె తీసుకోండి. కూరగాయలు వేయించి, అన్నం కలపండి. సింపుల్ గా టెస్టీ రెసిపీ సిద్దం.
అన్నం కట్లెట్స్ కోసం అన్నం, ఉడికించిన బంగాళాదుంప, ఉల్లిపాయ, మసాలాలు, బ్రెడ్ ముక్కలు తీసుకోండి. అన్ని పదార్థాలు కలిపి ఫ్రై చేయండి. ఇలా ఆరోగ్యకరమైన స్నాక్.రెడీ.
మిగిలిపోయిన అన్నం, గోధుమ పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోండి. అన్నం ను మసాలాలతో కలిపి పిండితో పరాఠా తయారు చేసుకోండి. పిల్లల టిఫిన్ కి అనువైనది.
అన్నం పాయసం కోసం అన్నం, పాలు, చక్కెర, నెయ్యి, యాలకులు, ఎండు పండ్లు అవసరం. నెయ్యిలో అన్నం వేయించి, పాలు, చక్కెర వేసి, నెమ్మదిగా ఉడికించాలి. ఇలా 15 నిమిషాల్లో టెస్టీ రెసిపీ సిద్దం