ఆహార పదార్థాలను అతిగా ఉడికించడం మానుకోవాలి. అతిగా ఉడికిస్తే పోషకాలు నశిస్తాయి.
కూరగాయలు ఉడికించిన నీటిలో కూడా కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వాటిని పారబోయకూడదు.
కూరగాయలను కట్ చేసి ఎక్కువసేపు ఉంచకూడదు. దానివల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి.
కూరగాయల పోషక విలువలు వాటి తొక్కలో కూడా ఉంటాయి. క్యారెట్, దోసకాయ, బంగాళదుంపలు కోసేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి.
అధిక వేడి మీద ఆహార పదార్థాలను వండకూడదు. ఇది ఆహారం పోషకాలను కోల్పోయేలా చేస్తుంది.
ఆహార పాత్రలను ఓపెన్ గా పెట్టకూడదు. ఇది క్రిములు పెరగడానికి, ఆహారం రుచి, వాసన కోల్పోవడానికి కారణమవుతుంది.
ఆహారం వండటానికి సరైన పాత్రలను ఎంచుకోవాలి. లేకపోతే ఆహారం రుచి మారడంతోపాటు పోషకాలు కూడా నశిస్తాయి.
పెరుగు ఎవరు తినకూడదో తెలుసా?
కంటి ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఇవి
గుండెల్లో బ్లాక్స్ అడ్డుకునే సూపర్ ఫుడ్స్
త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి