Food
మెదడు అభివృద్ధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
మెదడు అభివృద్ధికి , జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాలు తినవచ్చు.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేపలు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.
విటమిన్ కె, ల్యూటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు బ్రోకలీలో ఉంటాయి. అందువల్ల ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.
బెర్రీ పండ్లు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బాదం, పిస్తా, వాల్నట్ వంటి నట్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
విటమిన్ బి, ఇ కలిగిన ధాన్యాలు మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.
మెదడు ఆరోగ్యానికి సహాయపడే అనేక పోషకాలు డార్క్ చాక్లెట్‌లో ఉన్నాయి.