Telugu

సముద్రాల్లోని నీరు వేడెక్కితే చేపలు ఏమవుతాయి?

Telugu

వేగంగా వేడెక్కుతున్న సముద్రాలు

శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా సముద్రాల్లోని నీరు వేడెక్కుతోంది. దీనివల్ల చిన్న ప్లాంక్టన్ (సూక్ష్మజీవులు) నుంచి పెద్ద చేపల వరకు అన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.

Image credits: Getty
Telugu

వాతావరణ మార్పులు

సముద్రాలు వేడెక్కడం వల్ల అన్ని జీవులకూ నష్టం జరగదు. కొన్ని జాతులు ఈ వేడి నీటిలో కూడా బతుకుతాయి. కానీ మరికొన్ని జీవులు మాత్రం బతకలేక అంతరించిపోయే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

చేపలకు ముందే పొంచి ఉన్న ముప్పు

కాలుష్యం, మితిమీరిన వేట వల్ల సముద్ర జీవులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల వాటి ఆవాసాలు, ఫుడ్ చైన్ దెబ్బతింటుంది.

Image credits: Getty
Telugu

ఫుడ్ చైన్‌కు అంతరాయం

సముద్రంలో వచ్చే వడగాల్పుల వల్ల నీటి పొరలు వేగంగా మారిపోయి, పోషకాల దొరకవు. దీనివల్ల రాత్రికి రాత్రే మొత్తం ఫుడ్ చైన్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది మనిషికి కూడా ప్రమాదకరమే.

Image credits: Getty
Telugu

పోషకాలు కలవవు

2023లో వచ్చిన వడగాల్పుల సమయంలో, సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల నీటి పొరలు గట్టిపడి పోషకాలు కలవకుండా పోయాయని బాంగోర్ యూనివర్సిటీకి చెందిన టామ్ రిప్పెత్ హెచ్చరించారు.

Image credits: Getty
Telugu

ఫుడ్ చైన్‌కు ప్లాంక్టన్ ఆధారం

ఫైటోప్లాంక్టన్ లాంటి సూక్ష్మజీవులను చిన్న చేపలు తింటాయి. ఆ చిన్న చేపలను కాడ్, హాడాక్ లాంటి పెద్ద చేపలు తింటాయి. కాబట్టి ప్లాంక్టన్ దెబ్బతింటే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది.

Image credits: Getty
Telugu

జెల్లీఫిష్‌లు ఒక హెచ్చరిక

పరిశోధకుల ప్రకారం, యూకేలో జెల్లీఫిష్‌ల సంఖ్య పెరుగుతోంది. ఇవి వేడి నీటిలో బాగా పెరుగుతాయి. సముద్రపు ఫుడ్ చైన్ మారిపోతోందనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం.

Image credits: Getty

అత్యధిక పాలు ఇచ్చే ఆవు ఏది? రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందో తెలుసా?

ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?

Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?

మొఘల్ చక్రవర్తులకు ఇరానీ మహిళలంటే ఎందుకంత ఇష్టం?